తెలంగాణ ఔట్‌డోర్ మీడియాను రక్షించండి

Facebook
X
LinkedIn

సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీకి  తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్‌ అసోసియేషన్‌ వినతిపత్రం

హైదరాబాదు :

కాంగ్రెస్‌ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం జీవోనం.68ని రద్దు  చేసి, హోర్డింగ్‌ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్‌ అసోసియేషన్‌ బృందం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని కలిసి వినతిపత్రం సమర్పించారు.గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ‘‘జీవో 68ని రద్దు చేస్తాం. హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాదిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాల వారిని రక్షిస్తాం, చేయూతనిస్తాం’’ అని పేర్కొన్నవిషయాన్ని వారు జాన్‌వెస్లీ ద్రుష్టికి తెసుకవచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా, ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికైనా తక్షణమే 68 జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసారు.ఈ పరిశ్రమల ప్రకటనలపై వచ్చిన పన్నులతో స్థానికంగా రోడ్లు, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులు జరిగేవి. కానీ  2020లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో నం. 68ని తెచ్చి హోర్డింగ్‌ ఏజెన్సీలను రద్దు చేసింది. కేవలం వారికి ఇష్టమైన మూడు పెద్ద ఏజెన్సీలకే లాభం కట్టబెట్టేందుకు పూనుకున్నది. దీంతో చిన్న హోర్డింగ్‌ ఏజెన్సీలు ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లల్లో కార్యక్రమాలు కొనసాగిస్తుంటే, వాటిని అడ్డుకుని, హోర్డింగ్‌లు తొలగించింది. చదువుకుని, ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం నిరుద్యోగులు పెట్టుకున్న ఈ 209 ఏజెన్సీల్లో ఉన్న సుమారు 50వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్ర్తం చేసారు..దీనితో  ఏజెన్సీలన్నీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. పైగా గుత్తాధిపత్యంతో నడిపే రెండు ఏజెన్సీలు అసోసియేషన్‌ వాళ్ళని బెదిరింపులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు ఏజెన్సీలు మాత్రమే ఉండడం వలన ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయిందని పేర్కొన్నారు.  అదే విధంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హోర్డింగ్‌ ఏజెన్సీలను పునరుద్ధరించేందుకు జీహెచ్‌ఎంసీతో పాటు, తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు కొత్త ప్రకటనల విధానాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, చిన్నచిన్న ఏజెన్సీలు కూడా వ్యాపారం చేసుకునేలా టెండర్ల ప్రక్రియ ఉండేలా చూడాలని  వారి జాన్‌వెస్లీకి విజ్ఞప్తి చేసారు.