తన తండ్రి చికిత్స కోసం ఆరు లక్షల రూపాయలు అప్పు      ఆర్థిక సహాయం చేయాలని జగ్గారెడ్డిని కోరిన వికాస్ నాయక్

Facebook
X
LinkedIn

తక్షణమే స్పందించి 7లక్షల యాభై వేల రూపాయల నగదు ను అందించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి :

నిజామాబాద్ లోని స్నేహ సొసైటీ కి చెందిన అంధుల పాఠశాల లో ఐదవ తరగతి చదువుతున్న వికాస్ నాయక్ కుటుంబానికి ఆర్దిక సహాయం అందించి టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ….వికాస్ నాయక్     స్వస్థలం  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం  లోంకా తాండా ….. మూడు సంవత్సరాల వయస్సులో అనారోగ్యం తో చూపును కోల్పోయిన వికాస్….. పాటలు పాడటం,   కోమరెళ్ళి మల్లన్న, బీరప్ప  , రాముడు, సీత , హనుమంతుని లాంటి పౌరాణిక గాథ లను కథలు, పాటల రూపం లో ధారాళంగా చెప్పడం లో   ప్రావీణ్యం సంపాదించిన వికాస్ నాయక్…. టీవీ లో వచ్చే కార్టూన్ క్యారెక్టర్ ల డైలాగ్స్ ను అచ్చు గుద్దినట్లు అనుకరించి చెప్పగలగడం లో నేర్పు సాధించిన వికాస్…. రెండు కిడ్నీలు పాడై  గత రెండు సవత్సరాలుగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ వికాస్ నాయక్ తండ్రి…. జగ్గారెడ్డి ని కలసి  సహాయం అడగాలని   తన తల్లి, తాతయ్య, అమ్మమ్మ   పెద్దమ్మ లతో కలిసి  సంగారెడ్డి కి వచ్చిన వికాస్ నాయక్….. తన కోసం, తన తండ్రి చికిత్స కోసం ఆరు లక్షల రూపాయలు అప్పు , వడ్డీ లక్ష రూపాయలు అయ్యిందని, ఆర్థిక సహాయం చేయాలని వికాస్ నాయక్…. జగ్గారెడ్డిని కోరారు.తక్షణమే స్పందించిన జగ్గారెడ్డి 7లక్షల యాభై వేల రూపాయల నగదు ను అందించారు. పాటలు, పౌరాణిక గాథల్లోని పద్యాలను అలవోకగా  చెప్పిన తీరును చూసి వికాస్ నాయక్ ను జగ్గారెడ్డి అభినందించారు. మల్లన్న, బీరప్ప వీర గాథలను రాగ యుక్తంగా ఏకధాటిగా చెప్పడం తో   వికాస్ నాయక్ ప్రతిభ ను చూసి  జగ్గారెడ్డి…. అబ్బురపడ్డరు. తాను హనుమంతుని భక్తున్నని, హనుమాన్ మాల దరించాలనుకుంటుననాని తానే స్వయంగా యుట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానని, తనకు సపోర్ట్ చేయమని జగ్గారెడ్డి ని వికాస్ నాయక్ కోరారు. స్మార్ట్ ఫోన్ తెప్పించి ఇవ్వటమే కాకుండా యుట్యూబ్ ఛానల్ ఏర్పాటు కు సహకరిస్తానని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. బాగా చదువుకుని కలెక్టర్ అవుతానని వికాస్ నాయక్ పేర్కొనగా  కష్ట పడి చదువుకుని కలెక్టర్ కావాలని, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పిన జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.ఇక పై తమ ఇంట్లో జరిగే ప్రతీ కార్యక్రమం లోనూ పాటలు పాడేందుకు పిలిపిస్తానని జగ్గారెడ్డి….  వికాస్ నాయక్ కు తెలిపారు. జగ్గారెడ్డి స్వయంగా  కారు ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని  వారి స్వస్థలానికి పంపించారు.