న్యూఢిల్లీ :
ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముగింపునకు ముం దే అధికారికంగా ప్రకటించవచ్చు. ఈ విషయాన్ని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బీహార్‌లో ఇతర చోట్ల చేపట్టిన సర్ ప్రక్రియపై వివాదాలు ర గులుకున్నాయి. పైగా సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీటితో సంబంధం లేకుండా సర్ ప్రక్రియను తమ ఎన్నికల నిర్వహణ క్రమంలో చేపడుతారని ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఓటర్ల జాబితాల సవరణలను చేపట్టడం ఆనవాయితీగా ఉంది. ఈ ఏడాది చివరిలో బీహార్‌లో ఎన్నికలు పూర్తి కావల్సి ఉంది. వచ్చే ఏ డాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధానాధికారులు (సిఇఒ)లతో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం కీలక సమావే శం నిర్వహించింది.ఇందులో ఓటర్ల జాబితా సవరణల విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అన్ని నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి వి వాదాలకు తావు లేకుండా సర్ ప్రక్రియను పూర్తి చే యాల్సి ఉందని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మధ్యలో సర్‌ను ఆరంభించాలనే ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాల సిఇఒల నుంచి సమ్మ తి దక్కింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, యుటిల లో క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాల సవరణ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. బీహార్‌లో మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో, యు టిలలో సర్‌ను చేపట్టాలని నిర్ణయించారని అధికారులు తెలిపారు. బుధవారం సంబంధిత విషయం పై సదస్సుతో పాటు వర్క్‌షాప్ కూడా జరిగింది. ఇందులో సర్ నిర్వహణకు అవసరం అయిన మా ర్గదర్శక సూత్రాలను గురించి విశ్లేషించుకున్నట్లు తెలిసింది. రాష్ట్రాల వారీగా ఎప్పటిలోగా సర్ నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నారనేది తెలియచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల సిఇఒలను ఆరాతీసింది. ఇందుకు తాము ఈ నెలాఖరులోగానే క్షేత్రస్థాయిలో సర్వం సన్నద్ధం అవుతామని వారు చెప్పారు. దీనితో అక్టోబర్ మధ్యలో సర్ నిర్వహణకు రంగం సిద్ధం కావడం ఖాయం అయింది.