స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా కాళోజి జయంతి

Facebook
X
LinkedIn

తెలుగునాడు, కాప్రా :

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్పూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో 9 9 2025 ఉదయం కమలానగర్ ఆఫీసులో ప్రముఖ కవి పద్మవిభూషణ్ కాళోజి నారాయణరావు 111వ జయంతి కార్యక్రమం జరిగింది. కాళోజి నారాయణరావు జయంతి కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ముందుగా ఐద్వా జిల్లా కార్యదర్శి వినోద కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ కాళోజి నారాయణరావు గారు ప్రజా ఉద్యమాలతో మమేకమైన గొప్ప నాయకుడు అని అన్నారు. కాళోజి నారాయణరావు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ప్రతిఘటించారని చెప్పారు. పౌర హక్కుల ఉద్యమాల్లో, ప్రజాతంత్ర ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేశారని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి పిలుపుమేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో నుండి వెంగళరావు కు వ్యతిరేకంగా పోటీ చేశారని చెప్పారు. ఆయన బహు భాషా కోవిదుడు అని అన్నారు. ఆయన అనేక గ్రంథాలు రచించారని చెప్పారు. ప్రజల గొడును తన గోడుగా అందించారని చెప్పారు.ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించారు.

అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ కాళోజి నారాయణరావు మహారాష్ట్రలో పుట్టినప్పటికీ వరంగల్లో స్థిరపడి తెలుగులో అనేక గ్రంథాలు రాశారని చెప్పారు. “పుట్టుక నీది, చావు నీది, బతుకుతా దేశానిది” అంటూ గొప్ప సందేశాన్ని అందించారని చెప్పారు. గత ప్రభుత్వం కాళోజి నారాయణరావు జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు అత్యున్నతమైన పద్మ విభూషణ్ బిరుదును ప్రధానం చేశారని చెప్పారు. కాలోజి నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఐద్వా నాయకులు వినోద, లక్ష్మీ , పూజ, జయరాజు ప్రసంగించారు. అనంతరం సభ్యులు చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాస్ , ఉన్ని కృష్ణన్, జె చంద్రశేఖర్, గౌసియా, శోభ, శారద, వినోద, లక్ష్మి, పూజ, జయరాజ్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.