సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు చెన్నైలో అంతర్జాతీయ కలినరీ పోటీలు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ : 

సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు చెన్నైలో అంతర్జాతీయ కలినరీ పోటీలు నిర్వహిస్తున్నట్లు సౌత్ ఇండియా కలినరీ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశమని సీకా ఉపాధ్యక్షులు సుధాకర్ ఎన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ లోని ద పార్క్ హోటల్ లో పెద్ద ఎత్తున వర్క్ షాప్ ను నిర్వహించారు.  ee సందర్బంగా ఆయన మాట్లాడుతూ కలినరీ ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా అన్నారు. హైదరాబాద్ కు కలినరీ లో ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని అందుకు తగ్గట్టుగానే నేటి యువ తరాన్ని తయారు చేయాలన్నదే తమ ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు.  ఇందులో నగరంలోని ఆయా కళాశాలలకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు, వివిధ హోటల్స్ లో కళాశాలలో పనిచేస్తున్న చెఫ్ లు పాల్గొన్నారు.  ఈ వర్క్ షాప్ కు ప్రపంచ స్థాయిలో జరిగిన కలినరీ పోటీలో గోల్డ్ మెడల్స్ అందించిన ముగ్గురు ప్రధాన చీఫ్ చే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ పోటీ ఏ విధంగా ఉంటుంది అందులో ఏ ఏ అంశాలు ఉపయోగపడతాయి అనేదానిపై….. వివిధ రకాలైన వంటకాలు, కేక్స్, ఇలా దాదాపు 24  రకాలైన వంటకాలను తయారుచేసి విద్యార్థులకు పాకశాస్త్ర నిపుణులకు నైపుణ్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సికా కు సంబంధించిన ప్రధాన ప్రతినిధులు చెఫ్ మాస్టర్స్…. యాదగిరి సీతారాం ప్రసాద్ సంజయ్ కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు చెన్నైలో జరిగే అంతర్జాతీయ కలినరీ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 3 వేల మంది పాకశాస్త్ర నిపుణులు పోటీపడుతున్నట్టు నిర్వాహకులు వివరించారు.