కార్మికులు కర్షకులు ఆర్థికంగా స్వావలంబన పొందినపుడే నిజమైన స్వతంత్రం

Facebook
X
LinkedIn

గుంటూరు   :

కార్మికులు కర్షకులు,రైతులు  ఆర్థికంగా స్వావలంబన పొందినపుడే మనకు నిజమైన స్వతంత్రం లభించినట్లని యునైటెడ్ బహుజన పోరాట సమితి జాతీయ కన్వినర్ కరణం తిరుపతి నాయుడు అన్నారు. శుక్రవారం 79 వ స్వాతంత్ర్యం దినోస్సవం పురస్కరించుకొని సమితి కార్యాలయం  ఎదుట జాతీయ జండాను  ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్దించి 79  సంవస్సరాలు  దాతుతున్నప్పటికి కార్మికులు కర్షకులు, రైతుల  బతుకులు మారలేదని,  రెక్కఆడితేగాని దోక్కనిండని పరిస్తితని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కర్షకులు కార్మికులు ఐక్యమత్యంగా కలిసి ఉండి ఆర్థికంగా కుటుంబ పోషణతో అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ యూనిట్ గా ఉన్నప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.