ఎమ్మెల్సీగా నియామితులైన కోదండ రామ్‌, అమీర్ అలీ ఖాన్‌ల నియామకాలు రద్దు

Facebook
X
LinkedIn

                         సంచలన తీర్పు వెలువరించిన  సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ :

సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామితులైన తెలంగాణ జనపమితి అధ్యక్షుడు కోదండ రామ్‌, అమీర్ అలీ ఖాన్‌ల నియామకాలను తాత్కాలికంగా రద్దు చేసింది. వారి నియామకాలను నిలిపివేస్తూ కోర్టు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోడంగడరం, అలీ ఖాన్‌ల నియాకమకాలను బిఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవన్, సత్యనారాయణ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. తాజా తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరణ చేసింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని స్పష్టం చేసింది.