హైదరాబాద్ :
హ్యూమన్ రైట్ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సేవారత్న అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజవర్గం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంచర్ల ముత్య ప్రసాద్ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత మరియు స్వర్ణ గిరి ఆలయ చైర్మన్ మానేపల్లి రామారావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కరోనా సమయంలో ముత్య ప్రసాద్ నలుగురికి అన్నదానం మరియు మందులు పంపిణీ మరియు, ఆక్సిజన్ అందజేయడంలో కీలక పాత్ర వహించి ఎన్టీఆర్ జిల్లాలోని మంచి పేరు సంపాదించుకున్నారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా నిలిచారు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్న ముత్య ప్రసాద్ గారిని హ్యూమన్ రైట్స్ చైర్మన్ గుర్తించి ఘన సన్మానం చేయడం జరిగింది. ముత్య ప్రసాద్ మాట్లాడుతూ ఈ అవార్డు నా బాధ్యతను పెంచింది ముందు ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారని తెలిపారు. ముత్య ప్రసాద్ గారితో పాటు నకుల సాంబశివరావు గారికి, సత్యం బాబు గారికి , ఆంజనేయులు గారికి, దీప్తి గారి కి అవార్డ్స్ అందుకున్నారు.