చిన్న పిల్లలతో కలిసి వెళ్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే రెట్టింపు జరిమానా..

Facebook
X
LinkedIn

న్యూఢిల్లీ :

చిన్న పిల్లలతో కలిసి వెళ్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రెట్టింపు జరిమానా విధించాలని రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనదారుల భద్రతను, జవాబుదారీ తనాన్ని పెంపొందించేందుకు ఈ ప్రతిపాదన చేసింది. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటింపు లేదా ఉల్లంఘన ఆధా రంగా డ్రైవర్లకు ‘మెరిట్ అండ్ డీమెరిట్’ (పాజి టివ్, నెగెటివ్) పాయింట్ సిస్టమ్ను కూడా ప్రతిపాదించింది.