4వ ఆర్థిక శక్తిగా భారత్

Facebook
X
LinkedIn

జపాన్‌ను వెనక్కి నెట్టిన ఇండియా భారత్ కన్నా ముందున్నఅమెరికా, చైనా, జర్మనీ

న్యూఢిల్లీ :

భారతదేశం ఇప్పుడు 4వ అతి పెద్ద ఆర్థి క శక్తివంత దేశంగా అవతరించిందని నీతి ఆయో గ్ కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) బివిఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ కీలక మైలురాయి సాధన దిశలో మనం జపాన్‌ను వెనకకు నెట్టివేశామని వివరించారు. ఇది మనకు మనం చెప్పుకునే ప్రగ తి కాదని, ఐఎంఎప్ ఇతర అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు వెలువరించిన తాజా గణాంకాల, నివేదికల క్రమంలో వెలుగులోకి వచ్చిన సత్యం అని వివరించారు. తాను ఈ ప్రగతి పథం గురించి వివరిస్తున్న దశలో మన ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో బలోపేతంగా ఉందని తెలిపారు.ఇది మన నాలుగవ స్థానాన్ని నిర్థారించింది. ఇం తటితో ఆగిపోకుండా మనకు అన్ని రకాలుగా భౌ గోళిక రాజకీయ, ఆర్థిక అనుకూల పరిస్థితులు పలు విధాలుగా ఊతం ఇస్తున్నాయని సిఇఒ చె ప్పారు. అమెరికా, చైనా, జర్మనీ తరువాతి స్థానం మనదే అని, ఈ ప్రగతి పథం వేగం మరింత ఇనుమడిస్తే ఇక మనం వచ్చే రెండేళ్లలోనే మూడవ ఆర్థిక శక్తివంత దేశంగా నిలుస్తామని తెలిపారు. గత ఏడాది చివరి వరకూ ఇండియా జపాన్ కన్నా వెనుక ఉండి, ఐదవ ఆర్థిక శక్తిగా జాబితాలో ఉం ది. అయితే జపాన్‌ను మనం తోసిరాజన్నామని తెలిపారు. ఎప్రిల్‌లో ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ సంస్థల నివేదిక వెలువడింది. ఇందులో ఇండియా నాలుగవ ఆర్థిక శక్తి కానుందని తెలిపారని గుర్తు చేశారు. దేశ జిడిపి ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో 4.187 బిలియన్ డాలర్లు దాటుతుంది. ఇది జపాన్ ఆర్థిక శక్తిని దాటేయడం కిం దికి తీసుకోవచ్చు. ఇక తలసరి ఆదాయం క్రమంలో భారతదేశ వివరాలు ఐఎంఎఫ్ డేటా ప్రకారం చూస్తే ఏడాదిలో రెండింతలు అయింది. పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విశ్వసనీయ ప్రతిష్టాత్మక నివేదికలలో కూడా భారత్ అజేయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వైనం స్పష్టం అవుతోందని సిఇఒ తెలిపారు.ఐఎంఎఫ్ తమ ప్రపంచ ఆర్థిక .పరిస్థితి నివేదికలో భారతదేశ ఆర్థిక రంగం 2025 26 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం ఎదుగుదల ఉంటుందని విశ్లేషించింది. నిర్ణీత ఆరున్నర శాతంతో పోలిస్తే కొద్దిగా మందగమనం ఉంటున్నప్పటికీ పరిస్థితి ద్విగుణీకృత రీతిలో ఉందని తెలిపారని సిఇఒ చెప్పారు. ఈ విషయాలన్నింటిని సిఇఒ ఇటీవలి నీతి ఆయోగ్ భేటీలో పమర్పించిన వికసిత్ రాజ్య వికసిత్ భారత్ @2047 నివేదికలో తెలిపారు. ఇంతకు ముందటి వరకూ బలహీన స్థాయి ఐదవ ఆర్థిక శక్తిగా మన దేశందశాబ్ధ కాలంలో బలీయ ఆర్థిక శక్తివంత దేశంగా ఎదిగింది. ఇది ఇప్పుడు నాలుగో అతి పెద్ద ఆర్థిక శక్తిగా మారడం తిరుగులేని విజయం అని నీతి ఆయోగ్ నిర్వాహక అధికారి వివరించారు. ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్ణీత 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుని తీరుతుందని వివరించారు.