ఆధ్యాత్మిక కొండపై ప్రపంచ అందాల భామలు

Facebook
X
LinkedIn

సాంప్రదాయ చీరకట్టు బొట్టుతో దర్శనం

నుదుట తిలకం దిద్ది స్వాగతం పలికిన అర్చకులు

అఖండ దీపం వెలిగించిన ముద్దుగుమ్మలు

తెలుగునాడు,, యాదగిరిగుట్ట :

తెలంగాణలో రెండవ తిరుపతి గా పేరుగాంచిన ఆధ్యాత్మిక కొండ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గురువారం తొమ్మిది మంది ప్రపంచ సుందరీమణులు దర్శించుకున్నారు.

నుదుట తిలకం దిద్ది స్వాగతం

ఆలయ ప్రధాన ద్వారం వద్ద సుందరీమణుల నుదుట తిలకం దిద్ది అర్చకులు వారికి స్వాగతం పలికారు. నుదుట తిలకం, మెడలో పూల హారం, చీర కట్టుతో రెండు చేతులు జోడించి వారంతా అంతరాలయం లోకి ప్రవేశించారు. వారివెంట ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దంపతులు ఉన్నారు. తొలుత అఖండ దీపారాధనలో పాల్గొని, సువర్ణ ధ్వజస్థంభం వద్ద నమస్కారాలు చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి మహదాశీర్వచనం అనంతరం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బి నరసింహ మూర్తి శ్రీ స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికలు అందజేశారు.

కోలాటంనృత్యాల మధ్య….

ప్రపంచ సుందరీమణులకు ఎర్ర తివాచీలు పరిచారు. కోలాటాల బృందాలు, బృంద భరతనాట్యాలు, మంగళ వాయిద్యాల మధ్య వారి దేవస్థాన సందర్శన కొనసాగింది.

కట్టు దిట్టమైన పోలీసు భద్రత

ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా పోలీసులు కట్టు దిట్టమైన భద్రత కల్పించారు. యాదగిరి కొండ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. బ్రేక్ దర్శనాలు, శ్రీ స్వామి వారి జోడు సేవలను ఈ సందర్భంగా రద్దు చేశారు.దేవస్థానం చేసిన ఏర్పాట్లు ఆధ్యాత్మిక శోభాయమానంగా ఉన్నాయి.