వీర మరణం పొందిన మురళి నాయక్ చూపిన ధైర్య, సాహసాలు దేశానికి గర్వకారణం : నారా లోకేష్

Facebook
X
LinkedIn

తెలుగునాడు, అమరావతి :

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం అన్నారు.

మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని, ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.