హైదరాబాద్ కు చేరుకున్న మిస్ కెనడా Ms. Emma Deanna Cathryn Morrison

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణుల రాక ప్రారంభమయింది. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈ నెల 6 వ తేదీ నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు. మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ ( Ms. Emma Deanna Cathryn Morrison,) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు నేడు సాయంత్రం చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న మిస్ కెనడా కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు.