తెలుగునాడు, అమరావతి :
అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు.. అమరావతి అంటే ఒక శక్తి.. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ఆంధ్రప్రదేశ్గా ఇది మారుస్తుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇంద్రుడి రాజధాని అమరావతి అని మనకు తెలుసు.. ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి శుభసూచకం.. అమరావతి స్వర్ణాంధ్ర విజన్ కు శక్తిని ఇస్తుందన్నారు. తల్లి దుర్గ భవాని.. కొలువైన పుణ్యభూమిలో మీ అందరినీ కలవటం నాకు ఆనందంగా ఉందని.. మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తాను ఇప్పుడు అమరావతి పుణ్యభూమిపై నిలబడి ఉన్నానని అన్నారు. ఒక స్వప్నం సాకారం కాబోతుందని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక్కడ తనకు కనపడుతుంది ఒక నగరమే కాదు.. ఒక కల సాకారం అవుతుందన్న భావన కలుగుతుందన్నారు. అమరావతి అంటే సంప్రదాయం , పురోగతి అని అన్నారు. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదని వికాసిత్ భారతకు పునాది వేస్తుందన్నారు. అమరావతి ఇంద్రలో ఒక రాజధాని పేరు అని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభసంకేతం అని పీఎం మోడీ తెలిపారు. అమరావతి నిర్మాణం స్వర్ణాంధ్ర నిర్మాణానికి బీజం వేస్తుంది పేర్కొన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్న, త్వరగా పూర్తి చేయాలన్న చంద్రబాబుకే సాధ్యం అన్నారు. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు ఉంటుందన్నారు. ఐటీ, ఎఇ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానాంలో మారుతుంది అన్నారు. హరిత శక్తి స్వచ్ఛ పరిశ్రమలు, విద్యా వైద్య కేంద్రాలుగా అమరావతి మారుతుందన్నారు. అమరావతిలో మౌలిక పనుల కల్పనకు కేంద్రం సహకారం ఉంటుందన్నారు. తాను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాదులో ఐటి ఎలా అభివృద్ధి చేశారు తెలిపారు. అధికారులను పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధి పై అధ్యయనం చేశామన్నారు.