తెలుగునాడు హైదరాబాద్ :
హైదరాబాద్ లోని కాప్రా డివిజన్ ఎల్లారెడ్డి గూడ లో క్రికెట్ కోచింగ్ స్టేడియాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
టర్నింగ్ పాయింట్ క్రికెట్ ఆరిన అకాడమీ వ్యవస్థాపకులు శ్రీనివాస్ యాదవ్,రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో క్రికెట్ మైదానాన్ని ఎల్లారెడ్డి రెడ్డి గూడ లో ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన మైదాన ప్రారంభోత్సవానికి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి , డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూర్ణయాదవ్ ,
డివిజన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జి అరుణ్ కిరణ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్, పడమటి మల్లారెడ్డి, సాయికిరణ్ యాదవ్, జి సత్యనారాయణ,టి శ్రీహరి, మనోజ్ కుమార్, సంతోష్ చారి, కొబ్బనూరి నాగరాజు, నాగరాజు యాదవ్, నరేందర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, శివకుమార్, సురేందర్ రెడ్డి, సోమనాథ్, ప్రదీప్, సిద్ధిక్, వినోద్, అహ్మద్, ఈశ్వర్ యాదవ్, మల్లికార్జున యాదవ్, సుధాకర్ యాదవ్, అల్లాడి కుమార్ యాదవ్, సతీష్ యాదవ్, ఉప్పల్ అవినాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.