తెలుగునాడు, అమరావతి :
అనేక సేవ కార్యక్రమాలు, పూజలు, పుస్తక, పాట అవికష్కరణలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
కేక్ కటింగ్ లతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు
మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంతో సహా అన్ని నియోజకవర్గ, మండల, గ్రామ కార్యాలయాల్లో, దేశ విదేశాల్లో వజ్రోత్సవ జన్మదిన వేడుకను అట్టహాసంగా నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టిడి జనార్దన్, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా నాయకులు కేక్ కట్ చేసి గౌరవ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన, అన్నదాన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు తరలివచ్చారు.
శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఢిల్లీలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, దుబాయిలో మంత్రి కొల్లు రవీంద్ర, గుంటూరులో మంత్రి అనగాని సత్యప్రసాద్, టంగుటూరులో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కర్నూలులో మంత్రి టీజీ భరత్, ఉయ్యూరులో మంత్రి వాసంశెట్టి శుభాష్, వినుకొండలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరియు అనేక చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జుల ఆధ్వర్యంలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అరసవిల్లిలో సీఎం చంద్రబాబు కుటుంబ గోత్రనామాల పేరుతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలను చేశారు. తిరుమలలో సీఎం చంద్రబాబు పేరిట భాష్యం విద్యాసంస్థలు ఒక్కరోజు అన్న వితరణ చేయడం అభినందనీయం.
అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగాలపై టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, విక్రమ్ పూలె రూపొందించిన పుస్తకాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.
అలానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నాయకులు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 1.5 లక్షల మందికి అన్నదానం చేయడం విశేషం. హిందూ దేవాలయాలు, చర్చిలు, మసీదులలో తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నాయకులు ప్రార్థించారు. కొన్ని నియోజకవర్గాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడంతోపాటు మరికొన్నిచోట్ల రోగులకు పళ్ళు పదార్థాలు అందించారు. ముఖ్యంగా తెలుగు యువత రక్తాన్ని దానం చేసి తమ నాయకుడిపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. సామాజిక సేవలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేడు మునిగిపోవడం హర్షనీయం.