ఇంగ్లీష్ మరియు సంగీత ఉపాధ్యాయుని వరించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

గిన్నిస్ రికార్డులో రోస్ ఆఫ్ షారోన్ మ్యూజిక్ క్లాసెస్ మరియు జేసన్ విజన్ ట్యుటోరియల్ స్థాపకుడు అయినటువంటి సురేష్ రావెళ్ల కి అరుదైన గౌరవం.
కాప్రా మండలంలోని చర్లపల్లి నివాసి అయిన ఇంగ్లీష్ మాస్టారు, సంగీత ప్రియులైనటువంటి శ్రీ సురేష్ రావెళ్ల గారు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు.
డిసెంబర్ 1, 2024 న విజయవాడలోని హలెల్ సంగీత పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ స్థాయి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రదర్శనలో 1046 మంది ఒకే సమయంలో ఎలక్ట్రానిక్ కీబోర్డ్ నీ వాయించి దాని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఈ అరుదైన రికార్డు నెలకొల్పారు. దీనికిగాను ఏప్రిల్ 14న హైదరాబాద్ లోని ది వైయస్సార్ లైఫ్ చర్చిలో హలేలు సంగీత పాఠశాల ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్టిఫికేషన్ కార్యక్రమంలో హలెల్ సంగీత పాఠశాల స్థాపకుడు ఆగస్టిన్ వేణుగోపాల్ దండిoగి అలాగే అంతర్జాతీయ ప్రసంగికులు అనిల్ కుమార్ మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ఆనంద రాజన్ చేతుల మీదుగా గిన్నీస్ రికార్డ్ సర్టిఫికేట్ మరియు గోల్డ్ మెడల్ ని అందుకోవడం జరిగింది.


ఈ ఘనత సాధించిన సురేష్ రావెళ్ల ని వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు,విద్యార్థులు,తోటి టీచర్స్ తదితరులు అభినందించి భవిష్యత్తులో అత్యుత్తమ మ్యూజిక్ ను ప్రదర్శించి ఇలాంటి ఎన్నో ప్రపంచ రికార్డులను పొందాలని వారు కోరారు. అంతేకాకుండా విభిన్న ప్రతిభవంతుడైన సురేష్ రావెళ్ళ ఇదే సంగీత పాఠశాల నుండి గతంలో ఆసియ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్జీనియస్ వరల్డ్ రికార్డ్,అలాగే ద ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్ ని కూడా సాధించారు.