ఘనంగా తమ్మాళి రామకృష్ణ జన్మదినం వేడుకలు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

మై ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ సిఎండి, తెలంగాణ శోభన బాబు సేవా సమితి చైర్మన్, తమ్మాళి సంఘం రాష్ట్ర కన్వీనర్, బిఆర్ఎస్ సీనియర్ లీడర్, రాంపల్లి రాజరాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ తమ్మాలి రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈరోజు ముందుగా మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు బండ్లగూడ రోడ్డు విజయ గార్డెన్స్ కాలనీ, రోడ్ నెంబర్ వన్ లాలన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్లో అనాధ విద్యార్థుల మధ్య కేక్ కటింగ్, విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 35 నిమిషములకు నాగోల్ మమతా నగర్ లో ఉన్నటువంటి మైల్ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో తన కార్యాలయం సిబ్బందితో కలిసి కేక్ కటింగ్ మరియు అన్నదానాన్ని నిర్వహించారు.

సాయంత్రం ఏడు గంటల 11 నిమిషాలకు రాంపల్లి లోని రాజరాజేశ్వరి కాలనీలో కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీవాసులు అందరి మధ్య ఎంతో ఘనంగా కేక్ కటింగ్ చేశారు. తదనంతరం అందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ్మాలి రామకృష్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరారు.


ఈ సందర్భంగా తమ్మాలి రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ. తనకు దేవుని ఆశీస్సులు ఉన్నాయని, అందువల్లనే దైవ కార్యాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి కాలనీ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.