రైల్వే శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రాసెస్‌లో మార్పులు చేసింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎక్కువ సమయం సెక్యూర్ చేసుకునేలా బుకింగ్ టైమ్ అడ్జస్ట్ చేసింది. ఆ కొత్త నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
- 1-MIN READ | Trending Desk
Hyderabad,Telangana
Last Updated :December 9, 2024, 2:38 PM IST
01

తత్కాల్ టికెట్ అనేది ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు బుక్ చేసుకోగలిగే స్పెషల్ కేటగిరీ రైల్వే టికెట్. చివరి నిమిషంలో ప్రయాణం ఖరారైనప్పుడు లేదా ఎమర్జెన్సీ పనులు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే తత్కాల్ టికెట్లకు సంబంధించిన నిబంధనల గురించి ప్రయాణికులకు అవగాహన అవసరం.
02

ఒక PNRకి గరిష్టంగా నలుగురు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బుకింగ్ సమయంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి వ్యాలీడ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అవసరం. రైలు రద్దు అయితే తప్ప కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్లపై రీఫండ్ లభించదు.
03

ఇక అసలు విషయానికి వస్తే తాజాగా రైల్వే శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రాసెస్‌లో మార్పులు చేసింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎక్కువ సమయం సెక్యూర్ చేసుకునేలా బుకింగ్ టైమ్ అడ్జస్ట్ చేసింది. కొత్త నిబంధన ప్రకారం, ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్ బుకింగ్ ఇప్పుడు ఉదయం 10:10 నుంచి ప్రారంభమవుతుంది.
TOP VIDEO

నాన్-ఏసీ క్లాస్ తత్కాల్ బుకింగ్ ఉదయం 11:10 నుంచి మొదలవుతుంది. బుకింగ్ ప్రాసెస్‌ను సులభతరం చేయడం, ముఖ్యంగా అత్యవసర ప్రయాణానికి టికెట్లు అవసరమైన వారికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకొచ్చారు
టికెట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రయాణికులు IRCTC వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేయాలి. సైట్‌ను విజిట్ చేసి రిజిస్టర్ పై క్లిక్ చేసి, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలతో అకౌంట్ క్రియేట్ చేయవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, లాగిన్ అయ్యి.. ప్లాన్ మై జర్నీ విభాగానికి వెళ్లండి. డిపాచర్ స్టేషన్, అరైవల్ స్టేషన్, ప్రయాణ తేదీని ఎంటర్ చేయండి.
TRENDING NEWS
బుకింగ్ ట్యాబ్ కింద తత్కాల్ ఆప్షన్ ఎంచుకోండి. టికెట్ల లభ్యత ఆధారంగా మీకు నచ్చిన రైలు, తరగతి (ఏసీ లేదా నాన్-ఏసీ) ఎంచుకోండి. అనంతరం ప్రయాణికుల పేర్లు, వయస్సు, ఐడెంటిటీ ప్రూఫ్ వివరాలు.. ఇలా అన్ని వివరాలు ఎంటర్ చేయండి.
07
ఆ తర్వాత పేమెంట్ చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ వ్యాలెట్‌తో పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత, మీరు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా బుకింగ్ డీటైల్స్ అందుకుంటారు.
08
ఇక తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశాలను మెరుగుపరచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. బుకింగ్ సమయానికి కొన్ని నిమిషాల ముందు మీ IRCTC అకౌంట్‌కి లాగిన్ అవ్వాలి. సమయాన్ని ఆదా చేయడానికి యూపీఐ (UPI) లేదా నెట్ బ్యాంకింగ్ వంటి క్విక్ పేమెంట్ ఆప్షన్స్ ఉపయోగించండి. ప్రాసెస్ వేగవంతం చేయడానికి ప్రయాణికుల వివరాలను ముందుగానే నమోదు చేయండి, సేవ్ చేయండి. బుకింగ్ ప్రాసెస్ స్లో కాకుండా ఉండేందుకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ వాడటం మంచిది.
- FIRST PUBLISHED : December 9, 2024, 2:38 PM IST
Tatkal Tickets: మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..! తత్కాల్ టికెట్ అనేది ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు బుక్ చేసుకోగలిగే స్పెషల్ కేటగిరీ రైల్వే టికెట్. చివరి నిమిషంలో ప్రయాణం ఖరారైనప్పుడు లేదా ఎమర్జెన్సీ పనులు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే తత్కాల్ టికెట్లకు సంబంధించిన నిబంధనల గురించి ప్రయాణికులకు అవగాహన అవసరం.