మాతృ భాషకు పెద్ద పీట వేయడం అందరి బాధ్యత

Facebook
X
LinkedIn

శానససభాధిపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు
-3 వ ప్రపంచ తెలుగు మహా సభల లోగో ఆవిష్కరణ

తెలుగునాడు, విశాఖపట్నం :
మాతృ భాషకు పెద్ద పీట వేయడం ప్రభుత్వ, ప్రజల బాధ్యత అని, మాతృ భాషలో మాట్లాడడం ప్రతి ఒక్కరూ గర్వంగా భావించాలని, విద్యా బోధనలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, మాకు రాజకీయ జీవితం ప్రసాదించిన. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు తెలుగు భాష, సంస్కృతి, తెలుగు వారి స్వాభిమానం కోసం జీవించి అందరికీ ఆదర్శం గా నిలిచారని శానససభాధిపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు సంస్కృతికి ప్రాధాన్యత నిస్తూ మాతృ భాషను మరింత ముందుకు తీసుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయం అని అయ్యన్న పాత్రుడు అన్నారు. డా.గజల్‌ శ్రీనివాస్‌, ఆంధ్ర సారస్వత పరిషత్తు , ఆంధ్ర ప్రదేశ్‌ ఆధ్యక్షంలో 2026 జనవరి 3,4,5 తేదీలలో అమరావతి రాజధాని ప్రాంతం గుంటూరు శ్రీ సత్య సాయి స్పిరిచువల్‌ సిటీ గ్రౌండ్స్‌ లో 3వ ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.
తదుపరి ఆంధ్ర సారస్వత పరషత్తు, ఆంధ్ర ప్రదేశ్‌ మూడవ ప్రపంచ తెలుగు మహా సభలు-2026 లోగో ను గోల్ఫ్‌ క్లబ్‌, విశాఖపట్నం లో ఘనంగా ఆవిష్కరించారు..
డా. గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు భాషాభిమాని అయిన ఆత్మీయులు, ఆంధ్ర ప్రదేశ్‌. శాసన సభ, సభాధిపతి అయ్యన పాత్రుడు చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ జరగడమంటే ప్రతి తెలుగు బిడ్డ ఈ లోగో ను ఆవిష్కరించి నట్టే అని, ఆంధ్ర మేవ జయతే అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద తెలుగు పండుగగా తెలుగు మహా సభలు జరుగుతాయని, ముఖ్య మంత్రులు, గవర్నర్లు, కేంద్ర ప్రముఖులు, దేశాధినేతలు, న్యాయమూర్తులు, చలన చిత్ర, సాహితీ, సాంస్కృతిక ప్రముఖులు ఈ పండుగలో పాల్గొంటారని డా. గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. యువతకు, విద్యార్ధినీ విద్యార్ధులకు ఈ తెలుగు మహాసభలలో వారి సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రాధాన్యత నిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పరిషత్‌ కార్యదర్శి ధవేజీ, మేడికొండ శ్రీనివాస్‌ చౌదరి, తెలుగు మహా సభల ముఖ్య సమన్వయ కర్త పి.రామచంద్ర రాజు, రెడ్‌ క్రాస్‌ రాష్ట్ర అధ్యక్షులు వై.డి.రామారావు, కళా భారతి అధ్యక్షులు ఎమ్‌.ఎస్‌.ఎన్‌.రాజు, కోడూరి సుశీల పాల్గొన్నారు.