చలివేంద్రాన్ని ప్రారంభించిన నెమలి అనిల్ కుమార్

Facebook
X
LinkedIn

తెలుగునాడు, నాచారం :

మల్లాపూర్ డివిజన్ లోని నాగలక్ష్మి నగర్ కాలనీ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోయలకొండ రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరగడం వలన అనేక అవసరాలకు బయటికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతూ ఉంటారని, వారి ఇక్కట్లను గుర్తించి జన సంచార ప్రాంతాల్లో వారి దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాడం చాలా అభినందనీయం అని అన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా SC సెల్ అడ్వైసర్ PG సుదర్శన్ , మల్లాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బండి సంపత్ గౌడ్ , మల్లాపూర్ డివిజన్ NSUI అధ్యక్షులు బాతరాజు రాహుల్, మల్లాపూర్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మైథిలీ రింకు , మల్లాపూర్ డివిజన్ NSUI ఉ పాధ్యక్షుల సాయి తేజ, నవీన్ గారు ,యాసీన్ , నాయుడు , సాయి రామ్ గౌడ్ , సాయి రెడ్డి , సూరజ్ , సాయి , అజామ్ , ఉపేందర్ , సందీప్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.