చేతి రాత లో ఇందిరా హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Facebook
X
LinkedIn

తెలుగునాడు, నాచారం :

అందమైన చేతి రాత తోనే పాఠశాల పిల్లలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అందువల్ల పిల్లలు చక్కని చేతి రాత నేర్చుకోవాలని ప్రిన్సిపాల్ షేహనజ్ బేగం అన్నారు. సౌత్ ఇండియా చేతి రాత నిపుణులు ఎండీ మెహెరాజ్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలకు జరిగిన రాష్ట్ర స్థాయి చేతి రాత పోటీలలో సుమారు 15 వేల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో నాచారం కు చెందిన ఇందిరా హై స్కూల్ విద్యార్థులకు 3స్టేట్ బెస్ట్ పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డు మరియు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో 2 స్టేట్ బెస్ట్ అవార్డులు లభించాయి. దాంతో పాటుగా మరో 70 మంది విద్యార్థులుకు స్టేట్ వింగ్ అవార్డ్స్ మరియు సర్టిఫికెట్స్ లభించాయి. ఈ సందర్బంగా ఇందిరా హై స్కూల్ లో విద్యార్థులుకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన ముఖ్య అతిధులు మోహన్, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి అవార్డు మరియు సర్టిఫికెట్స్ విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమం లో స్కూల్ డైరెక్టర్స్ అన్వర్ మోహిద్దీన్, ఆఫ్సార్ మోహిద్దీన్, వైస్ ప్రిన్సిపాల్ అయేషా బేగం, పిఈటీ శేఖర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు.