స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు ఆధ్వర్యంలో
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి 3 4 2025 ఉదయం 11 గంటలకు కమలానగర్
ఆఫీసులో అమరవీరుని నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ముందుగా అమరుడు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ నాయకులు గద్దల నరసింహారావు, చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా యూనియన్ అధ్యక్షులు సత్యనారాయణ గారలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు యాదగిరిరావు మాట్లాడుతూ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా మరియు భూస్వాములు దేశముఖులు ప్రజలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా రైతాంగం తిరుగుబాటు చేసి విప్లవ పోరాటాన్ని నడిపించారు. ఆ పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణ సాయుధ పోరాటం ఉదృతంగా నడిచింది అన్నారు. గద్దల నరసింహారావు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జనగాం జిల్లా కడివెండి గ్రామంలో జన్మించి దేశముఖులు జాకీర్దారులకు వ్యతిరేకంగా సంఘం కట్టి పోరాటం చేశారని చెప్పారు. ఆ గుండాలకు బలైన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 19 ఏటనే మరణించడం మొత్తం తెలంగాణ కదిలించి వేసిందని అన్నారు. ఆనాడు దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగం ప్రతి ఒక్క రైతు ఆడ మగ పిల్లలు అందరు కలిసి దొరికిన దాన్ని దొరికినట్లు ఆయుధంగా చేభూని నిజాం సర్కారు సైన్యాన్ని జాకీర్దారుల కిరాయి మూకలను తిప్పి కొట్టారని చెప్పారు. ఆ పోరాట ఫలితంగా వేల ఎకరాలు ప్రజల పక్షాన చేరినాయని చెప్పారు. సామాజిక ఉద్యమ నేత జయరాజు గారు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య పోరాటం వృధా కాలేదని ఆయన చేసిన పోరాట ఫలితంగా గొప్ప మహోద్యమాన్ని నిర్మించగలిగిందని అన్నారు. అంతేకాకుండా ఇదే రోజు చత్రపతి శివాజీ వర్ధంతి కూడా ఉంది. అయితే చత్రపతి శివాజీది తుదమట్టించింది బ్రాహ్మణీయ కుతంత్రాల ఫలితంగానే జరిగిందని చివరకు అగ్రకుల దురహంకారం రాజ్యమేలిందని అన్నారు. శివాజీ శూద్రుడు కావడంతో బ్రాహ్మణీయ దుర్మార్గాలతో ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టాయని అన్నారు. ఇటు బ్రాహ్మనీయ దుర్మార్గులు, అటు మొగల్ సామ్రాజ్యవాదుల దాడులను తిప్పికొడుతూ దీర్ఘకాలం ఒక మహోన్నత రాజ్యాన్ని స్థాపించారని అన్నారు. వారికి సందర్భంగా నివాళులర్పిస్తున్నామని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు గుమ్మడి హరిప్రసాద్, జి శివరామకృష్ణ , లక్ష్మయ్య ప్రసంగించారు. అనంతరం సభ్యులందరూ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, విద్యావేత్త శరత్, లక్ష్మయ్య, గద్దల నరసింహారావు, శివరామకృష్ణ, గుమ్మడి హరిప్రసాద్, అంజలి, వాసు తదితరులు పాల్గొన్నారు.