అన్నార్తుల ఆకలి నుంచి టిడిపి పుట్టింది: బాలకృష్ణ

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ : 

నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్‌టిఆర్ అని ఎంఎల్‌ఎ బాలకృష్ణ తెలిపారు. ఎన్‌టిఆర్ అంటే నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారం అని ప్రశంసించారు. నందమూరి తారకరామారావు విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద నటుడు, ఎంఎల్‌ఎ బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టిడిపి పుట్టిందని, పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్‌టిఆర్ ప్రవేశపెట్టారని బాలకృష్ణ కొనియాడారు. ఎన్‌టిఆర్ అంటే ఒక వర్సిటీ జాతికి మార్గదర్శకం కావాలన్నారు. రామారావుకు వంటి వారికి మరణం ఉండదన్నారు.తెలుగు జాతికి గర్వకారణం, కోట్ల మంది గుండెల్లో చిగురించిన ఆశ, మా కుటుంబానికి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఆయన పేరు చెబితే గర్వపడని తెలుగు వారుండరన్నారు.నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందని, ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం, అందించిన స్ఫూర్తి, ప్రతి తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. నాటక రంగం నుండి సినిమా రంగం వరకు, సినిమా నుండి రాజకీయ రంగం వరకు ఆయన జీవితం ఒక దివ్య గాథ అని ప్రశంసించారు. నాన్న ఆశయాలు మా కుటుంబానికే కాదు, ప్రతి తెలుగువాడికీ మార్గదర్శకంగా ఉంటాయని, ఆయన చూపించిన మార్గంలో నడవడమే మా జీవిత పరమార్థమన్నారు. నాన్న ప్రతి పథకం, ప్రతి వాక్యం, ప్రతి అడుగు నేడు కూడా మాకు దీపస్తంభం అని, ఆయన ఆశయాలు మాకు జీవితసూత్రం, ఆయన కేవలం తెలుగు ప్రజల గుండెల్లోనే కాదు, దేశమంతటా స్ఫూర్తిదాయకమని బాలకృష్ణ కొనియాడారు.