తెలుగునాడు :
జీవితంలో కొత్తదనాన్ని ఆహ్వానించాలంటే,
నీలో ఉన్న భయ్యాన్ని నువ్వు జయించాలి,
నీ ఓటమిని నువ్వు అంగీకరించాలి,
నీ చుట్టూ ఉన్నవాళ్ళతో పెద్ద యుద్ధమే చెయ్యాలి,
ఇష్టపడిన దాని కోసం కష్టపడాలి,
చివరిగా నువ్వు మారాలి, నువ్వు గెలవాలి..! మార్పంటే,
కేలండర్ లో పేజీలు మారినంత సులువు కాదు, ప్రతి క్షణం నేను మారాలి, నేను ఎదగాలి, నేను గెలవాలి అనే ఆలోచన, ఆందోళన, ఆవేదన అనుక్షణం నీలో ప్రవహించాలి !!
ప్రతి ఎదురుదెబ్బ, నేర్చుకోడానికి అవకాశమే !
ఎన్ని ఒడిదుడుకులు ఉన్న, పట్టుదల అనే ఆయుధం ఎన్ని అడ్డంకులనైన అధిగమిస్తుంది అని తెలుసుకో!
ఎన్ని అడ్డంకులు, ఆపదలు, వచ్చిన సరే..
అనుభవించడం మాత్రం ఆపొద్దు!! ఎందుకంటే
అనుభవాలే గుణపాఠలుగా మారి,
గుణపాఠాలే జీవితాన్ని మారుస్తాయి.
గొప్పతనాన్ని సాధించే శక్తి నీకుంది,
గొప్పగా ప్రయత్నించి చూడు,
గెలిస్తే ఘనంగా స్వాగతం పలుకుతుంది ఈ జగత్తు !!
గెలవడానికి వేసే ప్రతి అడుగు విలువైనదే !!
