సంక్రాంతి సరదా.. బాల్య మిత్రులతో పతంగులను ఎగురవేసిన ఎంపీఆర్..!

Facebook
X
LinkedIn

తెలుగునాడు ఉప్పల్ :
నిత్యం రాజకీయాలతో తలమునకలయ్యే ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి (ఎంపీఆర్) సంక్రాంతి పండుగను సంబురంగా జరుపుకున్నారు.
ఉప్పల్ నియోజకవర్గం లోని ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏం పరమేశ్వర్ రెడ్డి తెలియజేశారు.
ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషమైన జీవితాన్ని ఆనందమయంగా చూసుకోవాలని కోరారు. పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఈ సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సంక్రాంతి
పర్వదినాన్ని పురస్కరించుకొని బాల్య మిత్రులతో కలిసి పతంగులను ఎగురవేసి ఎం పరమేశ్వర్ రెడ్డి ఆనందాన్ని పంచుకున్నారు. చిన్న నాటి జ్ఞాపకాలను నెముర వేసుకున్నారు.