అధ్యక్షులు మాతూరు నరేంద్ర రెడ్డి
తెలుగునాడు, ఏ.ఎస్.రావు నగర్ :
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి ఒక్క ముగ్గు ప్రతీక అని శ్రీ భావన రుషి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.నరేంద్ర రెడ్డి అన్నారు. కాప్రాలోని పద్మశాలి టౌన్‌షిప్‌గా ప్రసిద్ధి చెందిన భావన నగర్లో ఉన్న శ్రీ భావన రుషి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పార్క్‌లో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీ అధ్యక్షుడు ఎం నరేంద్ర రెడ్డి కుటుంబం సహకారంతో మొదటి ముగ్గురు విజేతలకు వెండి నాణేలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ..
ముగ్గుల పోటీల కార్యక్రమం గొప్ప సాంస్కృతిక విజయమని, వారి బృందం కృషి అంకితభావానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నాడు.

భోగి వేడుకలు..
భవష్యత తరాల వారికి మన సాంప్రదాయాలు, కట్టుబాటులు, పండుగలు గుర్తుఉండేలా నిర్వహించడం బోగి వేడుకలు నిర్వహించడంఆనందంగా ఉందని కాలనీ అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి అన్నారు. కాప్రాలోని పద్మశాలి టౌన్‌షిప్‌గా ప్రసిద్ధి చెందిన భావన నగర్లో ఉన్న శ్రీ భావన రుషి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టౌన్షిప్ ప్రధాన ద్వారం వద్ద శ్రీ గణేష్ అవధాని భోగి పూజ కార్యక్రమం ను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కాలనీవాసులు అందరూ సాంప్రదాయ వస్త్రాలలో కాలనీవాసులందరూ హాజరై సంస్కృతి స్ఫూర్తిని నిజంగా ప్రతిబింబించారు. తమ ఇళ్లలో భోగిని జరుపుకోలేనందున, కాలనీవాసులు శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా టౌన్షిప్ ప్రధాన ద్వారం వద్ద భోగి పూజ నిర్వహించినట్లు అధ్యక్షుడు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోగి పూజ గొప్ప విజయాన్ని సాధించిందని,అసోసియేషన్ చేసిన కృషి ముఖ్యంగా జాయింట్ సెక్రటరీ జి.భరత్ అంకితభావానికి ఈ విజయాన్ని అభినందిస్తున్నానని ఆయన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో మరింత గొప్ప భాగస్వామ్యం ఉంటుందని అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు ఎం. నరేంద్ర రెడ్డి తో పాటు ఉపాధ్యక్షుడు రాము కల్లెం, ప్రధాన కార్యదర్శి ఎన్.సుగుణేశ్వర్, కోశాధికారి బి.సదానందం, సంయుక్త కార్యదర్శి జి.భరత్, గౌరవ అధ్యక్షులు నవీన్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పరమేశ్వర్, ప్రసన్న మరియు లత ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.