ఉప్పల్ భగాయత్లో సంక్రాంతి సంబరాలు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, ఉప్పల్ :

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ మేకల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ 8 ఎకరాల పార్కు ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటినాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి , మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి , బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పా రెడ్డి , ఐ ఫోకస్ ముఖ్య సభ్యులు వాసుదేవ శర్మ, ఇంటిలిజెన్స్ డి.ఎస్.పి నరసింహారెడ్డి, ఉప్పల్ ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవి పాల్గొన్నారు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కథలు, పిల్ల, పెద్దల ఆటపాటలు, లాంటి తెలుగువారి సాంప్రదాయ కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి. అదేవిధంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న ఉత్సాహవంతమైన మహిళలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు భువనేశ్వరి టౌన్షిప్ (ఆనంద్ స్వామి) మరియు విష్ణు మైనింగ్ (శ్రీనివాసరావు) వారి సహకారంతో అతిధుల చేతుల మీదగా ప్రధమ బహుమతి విజయ, ద్వితీయ బహుమతి ప్రశాంతి, తృతీయ బహుమతి పావని, మరియు నాల్గవ, ఐదవ బహుమతులు నీరజా, సుచరిత బహుమతులతోపాటు ఆరు సంవత్సరాల చిన్నారి మహిరా ఎంతో ఓపికతో చాలా చక్కగా వేసిన ముగ్గుకు కూడా బహుమతి ఇవ్వడం జరిగింది. పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అద్దం పట్టినట్టుగా ఒక మహిళ వేసిన ముగ్గు ఎంతో ఆకట్టుకుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు మధురా చారిటబుల్ ట్రస్టు తరపున ప్రధమ, ద్వితీయ, తృతీయ, విజేతలకు ధన రూపంలో 10000 రూపాయలు అందజేశారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దుబ్బ నరసింహారెడ్డి , సల్ల రాజి రెడ్డి , సల్ల వీరారెడ్డి, గోనె అర్జున్ రెడ్డి , షామీర్పేట్ ధర్మారెడ్డి , మేకల హనుమంత్ రెడ్డి ,
అసోసియేషన్ సభ్యులు ఒక్కంటి శ్రీనివాసరావు, చంద్రశేఖర్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చిరంజీవి, సుభాన్ రెడ్డి, బంగ్లా శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి, శ్రీధర్ రెడ్డి, వెంకటయ్య, నరేంద్ర చౌదరి, సునీల్, అంజిరెడ్డి, మధుసూదన్ రావు, సుధాకర్ రెడ్డి, మహేష్,గణేష్, కిషన్ రావు, కోటేశ్వరరావు, అదేవిధంగా ముగ్గుల పోటీల నిర్వాహకురాలు మంజుల, స్వప్న, భగాయత్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.