ఆర్జీవీపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు

Facebook
X
LinkedIn

టాలీవుడ్‌ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన ఇప్పటకే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తనపై కావాలనే కేసులు పెడుతున్నారని పలు ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. దీంతో వారం క్రితం వర్మకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొన్న విషయం తెలిసిందే.

వర్మపై ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. తాజాగా కోర్టులో విచారణ జరిగింది. గతంలో వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని  గతంలో చెప్పిన వ్యాఖ్యలను మరోసారి కోర్టు ఆదేశించింది. వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో రేపు విచారణ జరగనుంది.

సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వర్మ ముందస్తు బెయిల్‌ కోరుతూ  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్‌ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత ఏపీలో సుమారు 9 జిల్లాలలో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.