ప్రజలు సేవాభావాన్ని పెంచుకోవాలి

Facebook
X
LinkedIn

సామాజికవేత్త శ్రీనివాస్ రెడ్డి

హైద్రాబాద్ :
ప్రజలు కుల మత ప్రాంత రాజకీయ పార్టీలకు అతీతంగా సేవా భావం పెంచుకోవాలని అప్పుడే సమాజంలో ప్రజలందరూ ఐకమత్యంతో సంతోషంతో జీవిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని సామాజికవేత్త బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేబీ శ్రీధర్ మరియు ప్రతినిధి బృందం కూకట్పల్లిలోని శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాతృ ప్రేమ యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్న మాతృదేవోభవ సత్సంగ్ సభ్యులను అభినందించారు ముఖ్యంగా యువత మాతృ ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని మాతృ ప్రేమతో కుటుంబంలోనే కాదు సమాజంలో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు మాతృదేవోభవ సత్సంగ్ చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు కార్యక్రమంలో సామాజిక వేత్త పూర్వ పోలీసు అధికారి శ్రీమతి ప్రేమ రెడ్డి దంపతులు సత్సంగ్ సభ్యులు రామ్ చందర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు