హైద్రాబాద్ :
తెలంగాణ రాష్ట్ర భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ సంస్థ ఆధ్వర్యంలో విజన్ 2034 ఏకో వర్క్ షాప్ భవిష్యత్ కోసం వ్యూహాత్మక ప్రణాళిక పై రెండు రోజులపాటు రాష్ట్ర ట్రైనింగ్ సెంటర్, జీడిమెట్లలో జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సోమనాథ్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి ఉద్దేశించి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ప్రధానంగా కార్య చరణ ప్రణాళికను రూపొందించుకోవడం తో పాటు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ,సభ్యుల సంఖ్యను , యూనిట్ లను పెంచుకోవడం,నాయకత్వాన్ని పెంపొందించుకోవడం,నిర్దేశించుకున్న లక్ష్యాలను రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయిలకు విది విధానాలనూ రూపోoదించుకోవడం కోసం ఈ పది సంహత్సరముల్లో సంస్థను బలోపేతం చేయడానికి ,
రూపోందించిన ముఖ్యమైన కార్యక్రమమని , జాతీయ హెడ్ క్వార్టర్ నుండి ప్రత్యేక ఆహ్వానం, విజ్ఞప్తి మేరకు విచ్చేసిన రిసోర్స్ పర్సన్ డాక్టర్ బి. రమేష్ పట్నాయక్ పర్యవేక్షణలో, డాక్టర్ D R K శర్మ ముఖ్య సలహాలతో ఈ కార్యక్రమమును నిర్వహించడం జరుగుతుందని వారికి ప్రత్యేక హృదయాభి వందనములు తెలియ చేశారు,
ఈ సందర్భంగా రాష్ట్ర BSG ఇచ్చిన పిలుపుతో అన్ని జిల్లా ల నుండి వచ్చిన స్కౌట్ మాస్టర్ అండ్ గైడ్ కెప్టెన్ జిల్లా ముఖ్య నిర్వాహక సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందించారు ,
ఈ కార్యక్రమానికి వారితోపాటు రాష్ట్ర ఆర్గనైజర్ కమిషనర్ స్కౌట్స్ T.పరమేశ్వర్ , డాక్టర్ ప్రమోదినీ , G. వెంకట్ రెడ్డి,
జాన్ శ్యామ్యుల్ గారు,రామ్ మోహన్ ,అమర జ్యోతి వెంకటేశ్వర్లు , సాయి నిరంజన్ , సాంకేతిక నిపుణులు గ్రీష్మ చంద్రికా, ప్రవీణ్ లు విచ్చేశారు,
మన హైద్రాబాద్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ తరుపున మన వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హమీద్ ,సెక్రటరీ వి. లక్ష్మణ్ నాయక్ , డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్, యన్. కరుణాకర్ ,
జిల్లా స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ వి. రాములు నాయక్ గారు, గైడ్ ఆర్గనైజింగ్ కమిషనర్ పి.అనితా గారు , జిల్లా కమిషనర్ వి. హేమలత , అకౌంట్ సెక్షన్ మమత, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు , ఈ సందర్భంగా హైద్రాబాద్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ఈ అవకాశము కల్పించినందుకు, రాష్ట్ర ట్రెజరీ రాజగోపాల్ సార్ గారికి ,రాష్ట్ర చీఫ్ కమిషనర్ దాన కిశోర్, మరియు రాష్ట్ర BSG డైనమిక్ సెక్రటరీ అయినా డాక్టర్ నవీన్ నికోలస్ సార్ గారికి హైద్రాబాద్ జిల్లా పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. భవిష్యత్ లో హైద్రాబాద్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలను
అధికారుల సహకారముతో వేగవంతముగా నిర్వహించుకుంటామని , ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మరియు చీఫ్ కమిషనర్ అయినా యాదయ్య గారికీ ప్రత్యేక హృదయభి వందనములు తెలియ చేస్తూ కృతజ్ఞతలు తెలియ చేశారు.వారి సహకారం తో జిల్లా లో నీ ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల ఉపాధ్యాయులు అనేకమంది కొత్తగా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది,
ఉపవిధ్యాధికారి బండ్లగూడ మండలం బి.వెంకటేశ్వర్లు జిల్లా కమిషనర్ స్కౌట్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలిపారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.