బీసీ గురుకులాలకు కొత్త గుర్తింపు

Facebook
X
LinkedIn

మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయాలు

హైదరాబాద్, :

బీసీ గురుకుల విద్యాసంస్థల బలోపేతం, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (MJPTBCWREIS) 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించారు.

సమావేశంలో సంస్థకు సంబంధించిన పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ప్రాంతీయ సమన్వయ కార్యాలయాల వివిధ విభాగాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులను బోర్డు ఆమోదించింది.

సంస్థ పేరులో మార్పు

ఇతర సంక్షేమ విద్యాసంస్థల సంఘాల తరహాలోనే మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ పేరును “తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (TGWCWMJPREIS)”గా మార్చాలని బోర్డు నిర్ణయించింది.

మెరిట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

బీసీ గురుకులాల నుంచి చదివి ఐఐటీలు, ఐఐఐటీలు, ఎన్ఐటీలు వంటి జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాలని బోర్డు నిర్ణయించింది. పోటీ విద్యా రంగంలో విద్యార్థులు మరింత ముందంజలో నిలవడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.