పారదర్శక ఓటర్ల జాబితాయే ప్రజాస్వామ్యానికి పునాది

Facebook
X
LinkedIn

ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పిలుపు

చిలకనగర్400 బూత్ లో”సర్” కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపీఆర్

ఉప్పల్ :

భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (SIR) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

పారదర్శక ఓటర్ల జాబితాయే ప్రజాస్వామ్యానికి పునాదిగా మారుతుందన్నారు. సర్ తో నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలి సూచించారు.

ఉప్పల్ నియోజకవర్గంలో గురువారం ప్రారంభమైన సర్ ను పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ డివిజన్ పరిధిలోని చిలకనగర్ లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి బీఎల్ఓలకు, బీఎల్ఏలకు తగు సూచనలు చేశారు.

SIR ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత
రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అన్నారు.

మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ ఆదేశాల మేరకు మనం ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి బాధ్యతతో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది సామాన్యుడికి ఉన్న అతిపెద్ద ఆయుధమన్నారు.

పారదర్శకంగా – నిష్పక్షపాతంగా సర్ సవరణ జరిగేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉప్పల్ నియోజకవర్గంలో SIR ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేలా మన BLAలు అందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాలని కోరారు. అర్హులైన, నిజమైన ఒక్క ఓటరు పేరు కూడా పొరపాటున కూడా ఓటర్ల జాబితా నుండి తొలగిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకునేలా మన ఏజెంట్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

ఓటర్ల సవరణ లేదా నమోదు ప్రక్రియలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి సులభంగా అవగాహన కల్పించేలా మనం సహాయపడాలన్నారు. బాధ్యతలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లు ప్రతి బూత్ పరిధిలో ఇళ్లను సందర్శించి ఓట్ల వివరాలను పరిశీలించాలన్నారు.

కార్యక్రమంలో చిలకనగర్ డివిజన్ అధ్యక్షులు రాజేష్ ముదిరాజ్,BLA మంచాల రఘు ,మహేందర్ ముదిరాజ్,కిరణ్, తదితరులు పాల్గొన్నారు