సంపద సృష్టి దిశగా అడుగులు
పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై అధ్యయనం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్,
ప్రభుత్వానికి ఆదాయ వనరులు తీసుకువచ్చే రంగాలపై పూర్తిగా దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మన వనరులే మన పెట్టుబడి అని ఆయన అన్నారు. శుక్రవారం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్టారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోరి పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవరం ఉందని అన్నారు. పర్యాటక కేంద్రాల్లోని ప్రభుత్వ భూములు, స్థలాలను సమర్థవంతంగా వినియోగించి ఖజానాకు ఆదాయాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. గోవా, కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు ఉపాధిని కల్పించడమే కాకుండా జీడీపీ పెరుగుదలకు టూరిజం ఉపయోగపడుతోందని చెప్పారు. మన రాష్ట్రంలోనూ టూరిజాన్ని అలగే అభివృద్ధి చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం రంగాల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. వారాంతాల్లో హెలీకాప్టర్ టూరిజాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో పర్యటకాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టాలని అన్నారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టూరిజం ఆస్తులు పూర్తి స్థాయిలో వినియోగంలో లేవన్నారు. వాటిని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసి సంపద సృష్టించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఆదాయ సమీకరణలో పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఏకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలో అవకాశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పీపీపీ ఆధారిత సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కేబినెట్ ముందుంచాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన విధానపరమైన అంశాలను కేబినెట్ ముందుంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.
లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పూడికతీత పనులపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేసింది. చట్టపరమైన నిబంధనలు పాటించే క్రషర్లకు అనుమతులు ఇవ్వాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది.
లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో పూడికతీత పనులపై కేబినెట్ పబ్ కమిటీ సమీక్ష చేసింది. చరంగా నిబంధనలు పాటించే క్రషర్ల నిర్వాహకులకు అనుమతులు ఇవ్వాలని సబ్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నది ఇసుకతో పోలిస్తే రోబో శాండ్ తక్కువ ధరకు లభిస్తోందని సబ్ కమిటీ గుర్తించింది.ఇరుగు పోరుగు రాష్ట్రాలకు ఇసుకను ఎగుమతి చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో రిజిష్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా స్లాబ్ అధారిత భూముల విలువ సవరణ వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
రవాణాశాఖకు సంబంధించి ఆదాయం… వసూళ్లు పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ కమిటీ సకమీక్ష్ చేసింది. అందులో భాగంగా బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ల విషయంలో పన్నులపై రాష్ట్ర అధికారాన్ని సమర్థిస్తూ కేరళకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లు సబ్ కమిటీ గుర్తించింది. భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన, విధానపరంగా తీసుకోవల్సిన అంశాలపై సబ్ కమిటీ చర్చింది. బీహెచ్ సిరీస్ పన్నుల అంశంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమాల ద్వారా ఆదాయ సమీకరణను సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్అథారిటీ కమిషనర్ శశాంక, తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్-ఎండీ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రెటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, ట్రాన్స్ పోర్ట్ కమిషన్ ఇళాంభర్తి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్రసాద్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, స్పెషల్ సెక్రెటరీ కృష్న ఆదిత్య, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్ తదతరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.