పారిశ్రామివాడలకు రోల్ మాడల్ గా చర్లపల్లి అభివృద్ధి: ఐలా చైర్మాన్ గోవిందరెడ్డి

Facebook
X
LinkedIn

చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ 01లో కోటి 30 లక్షల అభివృద్ది పనులు ప్రారంభం

చర్లపల్లి :

చర్లపల్లి పారిశ్రామికవాడను అదర్ష పారిశ్రామికవాడగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నమని చర్లపల్లి ఐలా చైర్మాన్ కె.గోవిందరెడ్డి అన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ 1లో కోటి 30 లక్షల రూపాయల (పారిశ్రామికవేత్తల సహకారం, ఐలా ఫండ్స్)తో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పారిశ్రామికవేత్తలతో కలసి ఐలా చైర్మాన్ గోవిందరెడ్డి ప్రారంభించారు.

ఈసందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండ దేశ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవాడలకు చర్లపల్లి రోల్ మాడల్ గా ఉంటుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు ఇబ్బంది కలగకుండ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నమని తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేనివిదంగా అహల్లదకరమైన పార్కు నిర్మాణంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నమని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం సహకరించిన పారిశ్రామికవేత్తలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఐలా మాజీ చైర్మాన్ మనోహర్ రాజు , పారిశ్రామికవేత్తలు సాయిదీప రంగారావు, ఐలా వైస్ చైర్మన్ తాటి శ్రీనివాస్, ఐలా కమిటి కార్యవర్గం, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గున్నారు.