సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మల్లిఖార్జున్ సభ్యురాలు బానుక నర్మద
హైద్రాబాద్ :
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో టిఫిటి జరుగుతున్న నిరంతర ఆలస్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మల్లిఖార్జున్ , సభ్యురాలు బానుక నర్మద పేర్కొన్నారు.
కంటోన్మెంట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ బోర్డుకు చట్టబద్ధంగా రావలసిన ఆదాయం సమయానికి అందకపోవడం వల్ల అభివృద్ధి పనులు మరియు ప్రజా సేవలు తీవ్రంగాప్రభావితమవుతున్నాయన్నారు.
మధ్యవర్తిత్వ వ్యవస్థ కారణంగా ఏర్పడుతున్న ఈ ఆలస్యాలు అనవసరమైనవి మాత్రమే కాకుండా, కంటోన్మెంట్ బోర్డు ఆర్థిక స్వతంత్రతను దెబ్బతీస్తున్నాయి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలంటే, బోర్డు ఆర్థికంగా బలపడడం అత్యవసరం మన్నారు.
అద్రృష్టవశాత్తు అసెంబ్లీ నందు MLA గణేష్ కి మాట్లాడేందుకు 4 సార్లు అవకాశం వచ్చినా కంటోన్మెంట్ TPT బకాయిల విషయం లేవనెత్తకపోవడం దురదృష్టకర మన్నారు అంతే కాకుండా ఇప్పటి వరకు కంటోన్మెంట్ కు బకాయిలు ఉన్న సుమారు 100 కోట్ల రూపాయలు తక్షణమే ఛేల్లించె విధంగా క్రృషి ఛేయాలని కోరారు. ప్రతిసారి అడుక్కోవడమే గాని రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా చెల్లించిన దాఖలాలు లేవు.
అందువల్ల Transfer of Property Tax (TPT) ను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా నేరుగా వసూలు చేయుటకు తక్షణ నిర్ణయం తీసుకోవాలని బానుక నర్మదా డిమాండ్ చేసారు
ప్రజల అభివృద్ధి, పారదర్శక పరిపాలన, మరియు వేగవంతమైన సేవల కోసం ఈ నిర్ణయం అత్యంత కీలకం. ఆలస్యం ఇక అస్సలు సహించేది లేదని ఆమె హెచ్చరించారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.