జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా… ఎమ్మెల్యే బండార్ లక్ష్మారెడ్డి

Facebook
X
LinkedIn

కాప్రా :
సమాజ సేవ కోసం నాయకులను తయారు చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం అండగా నిలుస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ మదర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని కాప్రా సర్కిల్ పరిధిలోని రాధిక చౌరస్తాలో గల పరివార్ హోటల్లో క్లబ్ అధ్యక్షులు లయన్ వడ్లోజు జ్యోతిర్మయ చారి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయనతోపాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, ఉప్పల్ ఏసిపి వెంకట్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమం కోసం తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ముఖ్యంగా పాత్రికేయులకు డబల్ బెడ్ రూమ్ నివాసాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు.

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం, ఆరోగ్య స్కీం అమలుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమైంది అన్నారు. పాత్రికేయుల పాత్రకు తమ వంతు సహకారం ఉంటుందని ఉప్పల్ ఏసిపి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పాత్రికేయులంతా బాగుండాలని ఆకాంక్షించారు. సమాజంలో ఎలా నాలుగు స్తంభాలలో అతి కీలకమైన పాత్రికేయుల వ్యవస్థ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సమాధ్యక్షులు, కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ నూతన అధ్యక్షులు లయన్ వడ్లోజు జ్యోతిర్మయా చారి పేర్కొన్నారు. సమాజం కోసం నాయకుల ఎదుగుదల కోసం సమాజంలోని రుగ్మతల రూపుమాపడానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల ఆర్థిక సామాజిక మానసిక స్థాయికి ప్రతి ఒక్కరు సహకరించే ప్రయత్నం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ లో అధ్యక్షులు వడ్లోజు జ్యోతిర్మయాచారి, ప్రధాన కార్యదర్శి ఆదిమూల శ్రీనివాస్, కోశాధికారి వట్టిపల్లి సురేష్, ఉపాధ్యక్షులు లక్కడి బాల్రెడ్డి కార్యనిర్వాక కార్యదర్శి గడ్డమీద బాలరాజు గౌడ్, కార్యదర్శిగుమ్మడి రోజా రాణి ప్రమాణ స్వీకారం చేశారు . టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ సమాజంలోని అవకతవకలను ఎత్తి చూపే క్రమంలో జర్నలిస్టులు డేగ కన్ను వేయాలన్నారు.ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రముఖ సంఘ సేవకులు లయన్ మాణిక్ రెడ్డి పాత్రికేయ కుటుంబాలకు 32 మందికి కుట్టుమిషన్లను అందజేశారు.

కుషాయిగూడ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్లు సుధాకర్ రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, సతీష్ విజయ్ఈ కార్యక్రమంలో చర్లపల్లి ఐలా చైర్మన్ గోవింద్ రెడ్డి, టిఫ్ చైర్మన్ సుధీర్ రెడ్డి చర్లపల్లి ఐల మాజీ చైర్మన్ రోషి రెడ్డి జలంధర్ రెడ్డి, గోపాలరావు, తాటి శ్రీనివాస్ వెంకటేశ్వర్ రెడ్డి,లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇన్నారెడ్డి డిస్టిక్ కలెక్టర్ గవర్నర్ కళ్యాణ్ కృష్ణారెడ్డి డిస్టిక్ వైస్ డిస్టిక్ మొదటి గవర్నర్ డాక్టర్ మండా సురేష్, డిస్టిక్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ శేఖర్ రెడ్డి, కాప్రెసరికి లీప్టి కమిషనర్ శ్రీహరి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, బిజెపి అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, సిపిఐ జాతీయ నాయకులు వి ఎస్ బోస్, సిపిఎం నాయకులు యాదగిరిరావు కోమటి రవి, బిజెపి రాష్ట్ర నాయకులు ఏనుగు రాజిరెడ్డి, నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి,కనుకుల రజినీకాంత్ రెడ్డి, రజినీకాంత్ రెడ్డి, రాంప్రదీప్ మునుగంటి,మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి,స్వర్ణరాజ్ శివమణి, బొంతు శ్రీదేవి,గుండారపు శ్రీనివాసరెడ్డి ప్రభుదాస్ పొన్నాల దేవేందర్ రెడ్డి,కమిటీ సలహాదారులు చంద్రమౌళి,కేసి మోహన్, కేసి మోహన్ సత్యనారాయణ, కడియాల రమేష్, కొత్త శ్రీనివాసరావు,, ఉల్లోజు శ్రీనివాస్, కీసరి సహదేవా చారి, వేముల శంకర్, శ్రీరామ్ శ్రీనివాస్, విజయ్ కుమార్, నర్సింగ్ రావు గౌడ్ గుమ్మడి హరి ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.