ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ గ్రాండ్ ఓపెనింగ్

Facebook
X
LinkedIn

కాప్రా :

ఓం శక్తి గ్రూప్ ఆధ్వర్యంలో కాప్రా డివిజన్ లో నిర్వహించిన ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అకాడమీని ప్రారంభించి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారు. యువత క్రీడల్లో ముందుకు రావాలని, ముఖ్యంగా బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో ప్రతిభ కనబరచి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

క్రీడా వసతులు మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ద్వారా యువతకు ఉత్తమ శిక్షణ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ బైరీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ , మాధవి స్థానిక నాయకులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.