50 ప్రపంచ స్థాయి పోటీ పర్యాటక కేంద్రాల జాతీయ మిషన్

Facebook
X
LinkedIn

ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం :

పార్లమెంట్ సమావేశాలలో సోమవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ని ఈ క్రింది విషయాలను తెలియజేస్తారా అని బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ప్రశ్నించడం జరిగింది.
2025-26 బడ్జెట్‌లో, 50 ప్రపంచ స్థాయి పోటీ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఒక ‘జాతీయ మిషన్’ను ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం నిజమేనా, ఒకవేళ నిజమే అయితే, ఈ ఉద్దేశ్యం కోసం రూ. 25,000 కోట్లు కేటాయించినప్పటికీ, ఈ పథకాన్ని ప్రారంభించకపోవడానికి గల కారణాలు ఏమిటి అని,
‘వ్యయ ఆర్థిక కమిటీ’ (EFC) సంబంధిత పత్రాన్ని (Note) రూపొందించి, ఆమోదించడం జరిగిందా?,
ఒకవేళ ఆమోదించి ఉంటే, దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? ఒకవేళ ఆమోదించకపోతే, దానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించడం జరిగింది.
ఇందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ దిగువ తెలిపిన విధంగా వ్రాత పూర్వకం గా సమాధానం ఇవ్వడం జరిగింది
2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రసంగంలోని 75వ పేరా ఈ విధంగా ఉంది:
“దేశంలోని అగ్రశ్రేణి 50 పర్యాటక కేంద్రాలను, రాష్ట్రాలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, ఒక ‘ఛాలెంజ్ మోడ్’ (పోటీ విధానం) ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కీలకమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని రాష్ట్రాలే సమకూర్చాల్సి ఉంటుంది. ఆయా పర్యాటక కేంద్రాలలో ఏర్పాటు చేసే హోటళ్లను, మౌలిక సదుపాయాల జాబితా (Infrastructure HML)లో చేర్చడం జరుగుతుంది.”
ఈ విషయానికి సంబంధించి ఒక ‘EFC పత్రాన్ని’ (Note) రూపొందించి, వివిధ మంత్రిత్వ శాఖల నుండి అభిప్రాయాలను సేకరించడానికి పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి, ఈ పథకం కోసం ఎటువంటి నిధుల కేటాయింపు కూడా ఆమోదించబడలేదని ఎంపీ బాలశౌరి కి
మంత్రి తెలియచేశారు.