ఆర్టిసి ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో ఎసి, డీలక్స్ బస్సల్లో 30 శాతం డిస్కౌంట్  

Facebook
X
LinkedIn

 హైదరాబాద్ :

చమురు కొరత వార్తలు సంచలనం సృష్టించాయి. ఏ బంక్‌లో చూసిన వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. కొంతమంది పెద్ద బాటిల్స్‌లో, క్యాన్లలో పెట్రోల్‌ను కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆర్టిసి చల్లటి వార్త అందించింది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఎసి, డీలక్స్ బస్సల్లో 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘పెట్రోల్ కష్టాలు పడడం ఎందుకు దండగ, ఆర్టిసి బస్సులు ఉండగా’ అని ఆర్టిసి ఎండి నాగిరెడ్డి పేర్కొన్నారు. బంకుల వద్ద బారులు తీరొద్దని.. సురక్షితంగా ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు.