తక్షణమే బడ్జెట్ ను సమీక్షించి బిసిల బడ్జెట్ ను రూ.20 వేల కోట్లకు పెంచాలి

Facebook
X
LinkedIn

         14 బీసీ సంఘాల అత్యవసర సమావేశం డిమాండ్

హైదరాబాద్ :

బడ్జెట్ లో బీసీలకు తీరని అన్యాయం చేశారని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ, అర్.కృష్ణయ్య ద్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉన్న తరుణంలో ఐది బీసీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ తెలంగాణా రాష్ట్ర  బడ్జెట్ పై 14 బీసీ సంఘాల అత్యవసర సమావేశం జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షత జరిగింది. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బడ్జెట్ లో రూ.3 లక్షల 24 వేల కోట్లలో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంతో పాటు కామారెడ్డి డెకరేషన్ లో ప్రతి యేటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి కూడా వాగ్దానం నెరవేర్చలేదని విమర్చించారు.. తక్షణమే బడ్జెట్ ను సమీక్షించి ఎన్నికల వాగ్దానం ప్రకారం బడ్జెటు రూ.20 వేల కోట్లకు పెంచాలని డిమాండ్  చేసారు.. బీసీ కార్పోరేషన్, బీసీ కుల ఫెడరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని,ఒక్కో బీసీ కుటుంబానికి రూ.20 లక్షలతో పాటు 80 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో  బీసీ సంఘాల నాయకులు రాజేందర్, అనంతయ్య, జిల్లపల్లి అంజి, శివ కుమార్, నికిల్ ,ఆశిష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.