హర్మూజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి..

Facebook
X
LinkedIn

 న్యూ డిల్లీ :

గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కోట్ల విలువైన ఆస్తిలు ధ్వంసమయ్యాయి. ఇంత జరిగిన ఈ యుద్ధ వాతావరణం చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఇంధన లోటుతో పలు దేశాలు ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధిని తెరవాలని పలు దేశాలు ఇరాన్‌ను కోరాయి. దాడులను ఆపాలని కూడా ఇరాన్‌ను 22 సంయుక్త ప్రకటన చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను పలు దేశాలు ఖండించాయి. యుఎఇ, బహ్రెయిన్, యుకె, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఈ దాడులను ఆపాలని విజ్ఞప్తి చేశాయి. ఇరాన్ చర్యల వల్ల అన్ని దేశాల ప్రజలపై దుష్ర్ఫభావం పడుతోందని ప్రకటించాయి.