రూ.894 కోట్ల విలువైన పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

తెలంగాణ రైతులు పండించిన 1,25,855 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను రూ.894 కోట్లకు పైగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చెల్లించి కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది  మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం రైతుల మీద పడకుండా వారికి నిరంతరం అండగా ఉంటూనే ఇప్పుడు పెద్ద ఎత్తున పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు ఆమోదం తెలుపడం మోడీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. 2026 పంట కాలానికి సంబంధించి రాష్ట్ర రైతులు పండించిన 29,860 మెట్రిక్ టన్నుల శనగలు, 37,020 మెట్రిక్ టన్నుల మినుములు, 55,285 మెట్రిక్ టన్నుల వేరుశనగ, 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు విత్తనాలనుకనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.. మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి సానుకూల చర్యల వల్ల తెలంగాణ రైతులకు తగిన ఆదాయం రావడంతోపాటుగా వాణిజ్య పంటలు పండించడానికి తగిన ప్రోత్సాహం కూడా లభిస్తుంది. అంతేకాకుండా, ఈ చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఊతమిస్తాయి.కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో భూసార పరీక్షలు మొదలుకొని సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు వంటి అనేక ప్రయోజనాలను రైతులకు కల్పిస్తోంది.దీంతోపాటుగా పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించడంతోపాటుగా, పండించేందుకు అయ్యే ఖర్చుకు కనీసం 50 శాతం నుంచి 100 శాతం అధికంగా కనీస మద్దతు ధరను అందిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టింది.