సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Facebook
X
LinkedIn

హైదరాబాద్  :

సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించింది. వైట్ కోట్ వేసుకుని డాక్టర్‌లా నటించి.. పేషెంట్లను బురిడీ కొట్టించింది. ట్రీట్‌మెంట్ పేరుతో ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం అపహరించింది.అనారోగ్యంతో ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నది. ఇవాళ డిశ్చార్జి కావాల్సి ఉంది. ఈ క్రమంలో ట్రీట్‌మెంట్ పేరుతో పేషెంట్ గదిలోకి వెళ్లిన నకిలీ డాక్టర్.. ట్రీట్‌మెంట్ పేరుతో రోగి బంధువులను బయటకు పంపించింది. అనంతరం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒంటిపై ఉన్న 10 తులాల బంగారం అపహరించింది. అనంతరం అక్కడి నుంచి జారుకుంది. కాసేపటికి రోగి బంధువులు లోపలికి వెళ్లి చూడగా ఒంటిపై బంగారం కనిపంచకపోవడంతో ఆందోళన చెందారు. దీనిపై యాజమాన్యాన్ని సంప్రదించగా.. ఆమె ఎవరో తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫేక్ డాక్టర్ కలకలం నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, నర్సింగ్ స్టాఫ్ రూమ్ వద్ద సీసీ కెమెరాల్లో నకిలీ డాక్టర్ కదలికలు రికార్డయ్యాయి. తెలిసిన వ్యక్తేనా? లేక బయటి వ్యక్తినా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.