ఖాళీ ఇంటికి రూ.1.99 కోట్ల కరెంట్ బిల్లు

Facebook
X
LinkedIn

అమరావతి :

ఖాళీ ఇంటికి రూ.1.99 కోట్ల కరెంట్ బిల్లు వచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. సామర్లకోట ప్రాంతంలోని టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు కొత్త ఇల్లు ఉంది. ఇప్పటి వరకు గృహ ప్రవేశం చేయలేదు. తాజాగా ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు కొత్త విద్యుత్ మీటర్ ఇచ్చారు. ఖాళీ ఇంటికి రూ.1.99 కోట్ల విద్యుత్ బిల్లు రావడంతో దాసరి దుర్గ షాక్ గురయ్యారు. దీనిపై స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేసింది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని సాంకేతిక లోపంతోనే కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చిందని ఆమెకు సర్ది చెప్పారు. సాంకేతిక లోపం సరి చేస్తామని విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం టిడ్కో ఫ్లాట్లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంపై నివాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.