ఫీజుల బకాయిలు చెల్లించాలని హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి.

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :

రాష్ట్రంలోని 16 లక్షల మంది బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులు – స్కాలర్ షిప్ ల బకాయిలు చెల్లించాలని రాష్ట్ర కమిటి పిలుపు మేరకు నేడు హైదరాబాద్ కలెక్టర్ వద్ద వేలాదిమంది కార్యకర్తలు ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర బిసి విద్యార్ధి సంఘం అధ్యక్షులు పగిళ్ళ సతీష్, రాష్ట్ర బి.సి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ తదితరులు నాయకత్వం 7వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు 8వేల కోట్లుకు వెయ్యి కోట్లు  కూడా ఇవ్వలేదు. అన్ని స్కీములకు – కాంట్రాక్ట్లకు వేల కోట్లు ఇస్తూ చదువుకునే విద్యార్థులకు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 50 ఏళ్లు చరిత్రలో స్కాలర్షిప్ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా ఇవ్వకుండా అన్యాయం చేయలేదు. ఇది ప్రభుత్వం ఫెయిల్ ర్ అయినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు.హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు.ప్రభుత్వం పేధ కులాలు చదువుకుంటే ఓర్వలేక స్కీమును నీరుగార్చే కుట్ర చేస్తుందని విమర్శించారు. బి.సి/SC/ST లు చదువు కోవడం పాలక పార్టీలకు ఇష్టం లేదని విమర్శించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో  జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర బి.సి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర విద్యార్ధి సంఘం అధ్యక్షులు పగిళ్ళ సతీష్, ఐఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, శివ కుమార్ యాదవ్, అంజి గౌడ్, నిఖిల్ పటేల్, చరణ్, యశ్వంత్ యాదవ్,  తదితరులు పాల్గొన్నారు.