రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి

Facebook
X
LinkedIn

విశ్రాంత ఉద్యోగుల దీక్షకు బీజేపీ నేతల సంఘీ బావం

*విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుంది

*బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్ :

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్-ధర్నా చౌక్ వద్ద బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు   అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం దీక్ష నిర్వహించారు.నిరాహార దీక్షకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విశ్రాంత ఉద్యోగులు చేస్తున్న నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది.పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు గళమెత్తారు. బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ నిరాహార దీక్షలో బీజే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా బీజేపీ స్పష్టం చేసింది.