ఫీజుల బకాయిలు.. స్కాలర్ షిప్ లు వెంటనే  చెల్లించాలి

Facebook
X
LinkedIn

మార్చు 6న రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు బహిష్కరణ..కలెక్టరేట్ ముట్టడి

జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులురాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు

హైదరాబాద్ :

రాష్ట్రంలోని 16 లక్షల మంది బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులు – స్కాలర్ షిప్ ల బకాయిలు చెల్లించాలని ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా తరగతిలో బహిష్కరించి కలెక్టరేట్లో, ఆర్డీవో, ఎంఆర్ఓ ఆఫీస్ ల వద్ద ప్రదర్శనలు చేయాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.సోమవారం బషీర బాఘ్ ప్రెస్ క్లబ్ లో 18 బీసీ సంఘాల సమావేశం బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ళ సతీష్, అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ee సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు 8వేల కోట్లుకు వెయ్యి కోట్లు  కూడా ఇవ్వలేదు. అన్ని స్కీములకు – కాంట్రాక్ట్లకు వేల కోట్లు ఇస్తూ చదువుకునే విద్యార్థులకు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 50 ఏళ్లు చరిత్రలో స్కాలర్షిప్ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా ఇవ్వకుండా అన్యాయం చేయలేదు. ఇది ప్రభుత్వం ఫెయిల్ ర్ అయినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు.ఈ ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఇది పరిక్షల సీజన్ హాల్ టికెట్లు ఇవ్వకుండా  ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనితో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. విదేశాలకు చదువుకోవడానికి సీట్లు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు లేక వెళ్లలేకపోతున్నారు. ముఖ్యమైన స్కాలర్ షిప్ , ఫీజు బకాయిలు, స్కీమును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో పగిళ్ళ సతీష్, నీల వెంకటేష్, రాజేందర్, అనంతయ్య, మోడీ రాందేవ్, కిషోర్ యాదవ్, నిఖిల్ పటేల్, లవాకుమార్, అంజి గౌడ్, నరేష్ గౌడ్, మేకల శ్రీనివాస్ యాదవ్ రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.