పేద మహిళ అంత్యక్రియలకు వెస్సో, విశ్వంలో విలీనం సేవా ట్రస్టుల సహాయం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

వడ్రంగి పని జీవనాదరంగా చేసుకొని జీవిస్తున్న  కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో నివాసం ఉంటూ తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరివాడైన వాడపల్లి శివ సాయి కి వేస్సో ట్రస్ట్ ,విశ్వంలో విలీనం సేవా ట్రస్ట్ 10,000 పదివేల రూపాయలు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి.ఇప్పటి వరకు ఆదా చేసుకున్న డబ్బు క్రిందటి నెల జరిగిన తండ్రి సంవత్సరీకానికి, ఆ పిదప తల్లి వైద్యానికి ఖర్చు చేయగా ఇప్పుడు తల్లి అంత్యక్రియలు పూర్తి చేయడానికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో శివ సాయి స్థానిక సంఘ నాయకుల ద్వారా వేస్సో ట్రస్ట్ మరియు విశ్వంలో విలీనం సేవా ట్రస్టులను సహాయం కోరాడు. స్పందించిన ఉభయ సేవా సంస్థలు సంయుక్తంగా ఆర్దిక సహాయాన్ని అందజేసాయి