ఫీజుల రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

Facebook
X
LinkedIn

సచివాలయంలో ఎస్ రామకృష్ణారావుకు  బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం

హైదరాబాద్ :

గత ఐదు సంవత్సరాలుగా రావలసిన ఏడువేల కోట్ల ఫీజుల రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని సచివాలయంలో ఎస్ రామకృష్ణారావును బీసీ జేఏసీ నేతల కలిసి వినతి పత్రం సమర్పించారు.అనంతరం మీడియాతో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఫీజుల రియంబర్స్ మెంట్ సమస్య ప్రైవేటు కళాశాల యజమాన్యాలు, ప్రభుత్వ మధ్యాన ఉన్న సమస్య కాదు 22 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా ప్రభుత్వం చూడాలి ఫీజుల నిధుల విడుదల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం చేస్తుంది ఫీజుల రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు 5 వేల కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే బదులు, పేద విద్యార్థుల ఫీజుల కోసం ఆ నిధులను కేటాయించాలి ఫీజుల బకాయిలు విడుదల చేయాలని త్వరలోనే రాష్ట్ర గవర్నర్ ను, సీఎం ను కలుస్తాంమార్చ్ 16 అసెంబ్లీ సమావేశాలు జరిగే లోపు ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడిస్తాం విద్యార్థుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో విద్యార్థుల చదువుల కోసం నిధులు లేవనడం సిగ్గుచేటన్నారు.